AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం మీదుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలకు పొడిగాలులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2నుంచి 4డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 2నుంచి 3డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో రాయలసీమ, కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది.