AP: రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా చెబుతున్నా, అనధికారికంగా 150కిపైగా ఉంటుందని వెల్లడించారు.