గోవా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వాస్కోడిగామా రైలులో ఎక్సైజ్ అధికారులు భారీగా మద్యాన్ని పట్టుకున్నారు. 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏఈ ఎస్ జీవన్ కిరణ్, ఎస్‌టీఎఫ్, డీటీఎఫ్ సీఐలు సుభాష్ చందర్, బాలరాజు నేతృత్వంలో 20 మంది సిబ్బంది శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు తనిఖీలు నిర్వహించారు. పలువురు వద్ద ఉన్న 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.రెండు లక్షల మేర ఉంటుందని అంచనా.