జనరేటర్ బెల్టులో చిక్కుకుని బాలిక మృతి

77చూసినవారు
జనరేటర్ బెల్టులో చిక్కుకుని బాలిక మృతి
తిరుపతి జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. వాకాడు మహాలక్ష్మమ్మ అమ్మవారి ఊరేగింపులో అపశ్రుతి జరిగింది. జనరేటర్ బెల్టులో చిత్తూరు జిల్లాకు చెందిన నవ్య శ్రీ (11) చిక్కుకొని మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్