చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో లారీని ఓ కారు ఓవర్‌టేక్ చేయబోయింది. ఈ క్రమంలోనే కారును తప్పించబోయిన లారీ అటుగా నడిచి వస్తున్న మహిళపై దూసుకెళ్లింది. మహిళ ఘటన స్థలంలోనే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.