ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ISIS గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దుల్లా మక్కి ముస్లి అల్ రిఫాయి అమెరికా నిర్వహించిన వైమానిక దాడిలో హతమయ్యాడు. అబ్దుల్లా మక్కిని అబూ ఖదీజా అని కూడా పిలుస్తారు. ఇరాక్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అమెరికా వైమానిక దళం దాడి చేపట్టింది. అబ్దుల్లా మక్కి ఐసిస్ గ్రూపులో రెండవ స్థాయి కమాండెంట్‌గా ఉన్నాడు.