డ్రైవర్ నిర్లక్ష్యం.. గేటు మీద పడి ఆరేళ్ల బాలిక మృతి

57చూసినవారు
డ్రైవర్ నిర్లక్ష్యం.. గేటు మీద పడి ఆరేళ్ల బాలిక మృతి
గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో అభం శుభం తెలియని బాలిక మృతి చెందింది. సూరత్ లోని గోదాదర ప్రాంతంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఇంటి గేటును ఢీకొట్టాడు. అదే సమయంలో అక్కడ ఆడుకుంటున్న సెక్యూరిటీ గార్డు ఆరేళ్ల కూతురుపై గేటు పడడంతో బాలిక మృతి చెందింది. గేటు కిందపడినా కారును అలాగే ముందుకు డ్రైవ్ చేయడంతో బాలిక నుజ్జునుజ్జు అయింది. స్థానికులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్