హోలీ పండుగను దేశవ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ తమ సంతోషాన్ని పంచుకుంటారు. కానీ, పంజాబ్‌లోని లూథియానాలో శుక్రవారం మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రార్థనలు చేస్తుండగా తమపై రాళ్లు రువ్వినట్లు ఓ మతం వారు చెబుతున్నారు. ముందుగా మసీదు వైపు నుంచి రాళ్ల దాడి మొదలైందని ఓ మతం వారు చెబుతున్నారు. ఇరువర్గాల ఘర్షణలో పలు వాహనాలు, మసీదు కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి.