ప్రజలు తిరస్కరించినా వైసీపీ అధినేత జగన్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేది టీడీపీ కార్యకర్తలైనా సరే సహించేది లేదని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో జగన్ మళ్లీ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని, వైసీపీ కుట్రల్ని అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.