AP: తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ మండిపడింది. 'మొన్న టీడీపీ గుర్తుని వేసుకుని తిరుమలలో కారు చక్కర్లు కొట్టింది. నేడు శ్రీవారి ఆలయ ఆవరణలో షూతో మంత్రి సవిత భద్రతా సిబ్బంది హడావుడి చేశారు. చంద్రబాబు.. తిరుమల పవిత్రతను ఇలానేనా కాపాడేది? మరోసారి టీటీడీ విజిలెన్స్ డొల్లతనం బట్టబయలైంది' అని వైసీపీ ట్వీట్ చేసింది.