తిరుమల తిరుపతి దేవస్థానంపై సామాజిక మాధ్యమాల్లో జరిగే దుష్ప్రచారాలను నమ్మవద్దని టీటీడీ ఈవో శ్యామలరావు కోరారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి వారానికి రెండు సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఈవో ఖండించారు. శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోటా పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వీటిపై జరుగుతున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.