AP: వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇక నుంచి 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉండనుందని వెల్లడించారు. 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.