వారిని రైలు పట్టాలపై పడుకోబెడతా: టీడీపీ ఎమ్మెల్యే (వీడియో)

66చూసినవారు
AP: గుంతకల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే.. రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీడియా అంటే తనకు లెక్కలేదని, తనపై లేనిపోనివి రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ‘నేను అన్నీ చేసి వచ్చిన వాడిని.. ఏం రాసుకుంటారో రాసుకోండి. తప్పు చేస్తే రాయండి. ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా. తప్పును నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతా.’ అని జయరాం అన్నారు.

సంబంధిత పోస్ట్