మరో 75 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్

53చూసినవారు
మరో 75 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్
ఏపీ ప్రజలకు మరో శుభవార్త. వచ్చే నెల 13న రాష్ట్రవ్యాప్తంగా మరో 75 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. కాగా, ఇటీవలే ఏపీ ప్రభుత్వం 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. ఉదయం 7.30 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు లంచ్, రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు డిన్నర్ అందజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్