చిన్నపాటి వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపివేత

72చూసినవారు
నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు, సీతారాంపురం, ఉదయగిరి, మర్రిపాడు, ఏఎస్పేట తదితర మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఆకాశం మేఘామృతమై మోస్తారు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఆకాశంలో మార్పులు చోటు చేసుకుంటే చాలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

సంబంధిత పోస్ట్