చంద్రగిరి: తిరుచ్చిపై ఊరేగిన సుందరాజ స్వామి

82చూసినవారు
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీసుందరరాజస్వామి సోమవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీసుందరరాజ స్వామిని శోభాయమానంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి మాడ వీధుల్లో ఊరేగారు.

సంబంధిత పోస్ట్