తుమ్మలగుంటలో.. కొలువుదీరిన తమలపాకు వినాయకుడు

50చూసినవారు
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో ప్రత్యేక ఆకర్షణతో తమలపాకుల వినాయకుడు శుక్రవారం కొలువు దీరాడు. తమలపాకు వినాయకుని చుట్టూ కృత్రిమంగా అందమైన అడవి ఏర్పాటు చేసి ఇరువైపులా నెమళ్లను కూడా అమర్చారు. భక్తులను ఆకట్టుకునేలా తమలపాకు వినాయకుని ప్రతిమను ఎంతో అందంగా తయారు చేశారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సూచనల మేరకు సినీ రంగం నుంచి వచ్చిన ఆర్కిటెక్చర్ మురళి 5రోజుల పాటు శ్రమించి తమలపాకు వినాయకున్ని తయారు చేశారు.

సంబంధిత పోస్ట్