పౌష్టికాహారమే ఆరోగ్యపదిలానికి పరమ ఔషధమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. రామచంద్రాపురం మండలం కొత్త వేపకుప్పం గ్రామంలో శనివారం సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా పలువురు గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. గర్భిణీలకు సామూహిక సీమంతం నిర్వహించి అక్షింతలు వేసి, వారికి పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అందించి ఆశీర్వదించారు.