మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని 2023 మిస్ ఇండియా ఐకానిక్ దివా విన్నర్, మిత్ర ఫౌండేషన్ ఎస్ఇఎస్ చైర్ పర్సన్ భావన చిన్నతంబు అన్నారు. కలకత్తాలోని ఓ ఆసుపత్రిలో జూనియర్ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం, దారుణ హత్య ఘటనపై సోమవారం చంద్రగిరి పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళా డాక్టర్ పై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామనీ, బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.