మనం నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని నగర కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ చెప్పారు. స్వచ్ఛతాహీ సేవ -2024 కార్యక్రమాల్లో భాగంగా శనివారం చిత్తూరులోని గిరింపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో శుభ్రత, ప్లాస్టిక్ లేని జీవనం అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ శుభ్రత కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.