గుడిపాల మండలంలోని నరహరిపేట ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ ఢిల్లీ బాయ్, ప్రధానోపాధ్యాయులు ఖాతూంబి మధ్యాహ్న భోజనం పథకాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెనూ ప్రకారమే పిల్లలకు భోజనాలు అందించాలన్నారు. అలాగే నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు. మధ్యాహ్న భోజనం పథకం పై తల్లిదండ్రుల ద్వారా ఎటువంటి ఫిర్యాదులు తమకు రాకూడదన్నారు.