బైకులు చోరీ చేసిన నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ చిత్తూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఉమాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. బంగారుపాలెం ఏఎస్ఐ నాగమల్లప్ప నాయుడు కథనం ప్రకారం, బంగారుపాళ్యంలో 2023లో 2 బైకులు చోరీ చేసిన యాదమరి మండలం, గుట్టకిందపల్లి గోవిందరాజుపై అప్పటి ఎస్ఐ కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. నేరం ఋజువు కావడంతో న్యాయమూర్తి జైలుశిక్ష విధించారు.