కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి రాష్ట్ర ప్రజలపై కరెంటు ఛార్జీల బాదుడుపై నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ లను మంగళవారం ఆవిష్కరించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కృపా లక్ష్మి చేతుల మీదుగా జీడి నెల్లూరులో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు, నాయకులు అందరూ కలిసి విజయవంతం చేయాలని కృపాలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో జీడి నెల్లూరు నియోజకవర్గ ఆరు మండలాల నాయకులు పాల్గొన్నారు.