ఆలయాల్లో ప్రత్యేక పూజలు

76చూసినవారు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కార్వేటినగరం పట్టణంలోని ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయం, బంగారమ్మ ఆలయం, అంకాల పరమేశ్వరి ఆలయం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. అశేష భక్తజనం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పలు ఆలయాల వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.