గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో శుక్రవారం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందులో భాగంగా కార్వేటినగరం మండలంలోని ఆర్కే విబి పేటలో ప్రధాన రహదారి నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు సిసి రోడ్లు, అదేవిధంగా మారేపల్లి గ్రామంలో పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని నాయకులు తెలిపారు.