చిట్టమూరు మండలం గ్రామ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు అయిన మంగళవారం చిట్టమూరు గ్రామంలో ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద క్షేత్ర స్థాయి అవగాహన కల్పించారు. గ్రామాల్లో క్లాప్ మిత్రాలు ఇంటి వద్ద నుండి సేకరించిన తడి, పొడి చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తరలించాలి అని ట్రైనింగ్ నిపుణులు సూచించారు.