గూడూరు సమీపంలోని సవటపాలెంలో బుధవారం రాత్రి టీడీపీ విస్తృత ప్రచారం చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, కనుమూరు హరిచంద్రారెడ్డి, కిరణ్ కుమార్, చాన్ బాష, పిట్టి నాగరాజు, వెంకటేశ్వరరాజు, శ్రీనివాసులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. టీడీపీ చేపట్టనున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పిట్టి నాగరాజుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.