విడవలూరు: రాజ్యాంగ పరిరక్షణ వేడుకలు
పెడలూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ వేడుకలను ప్రిన్సిపల్ దీనదయాళ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. మొదటగా పౌరనీతి శాస్ర అధ్యాపకులు కట్టా సాంబశివరావు భారత రాజ్యాంగ పీఠికను విద్యార్థులచే చదవించి ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని పూలతో అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. విద్యార్థులు అధ్యాపకులు, అధ్యాపకేతార సిబ్బంది పాల్గొన్నారు.