జనసేనాని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టడంతో పాటు డిప్యూటీ సీఎం కావడంతో పవన్ వీరాభిమాని కొనమల్ల పెంటారావు అయోధ్యకు సైకిల్ యాత్ర చేపట్టారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోనీ పొట్టి దొరపాలెంకు చెందిన పెంటారావు సుమారు 2 వేల కిలోమీటర్ల యాత్రలో భాగంగా బుధవారం కుప్పం చేరుకున్నారు. పెంటారావుకు కుప్పం జనసేన ఇన్ఛార్జ్ నరేష్, జనసైనికులు స్వాగతం పలికి ఆయనకి అవసరమైన వస్తువులను అందజేశారు.