నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గురువారం నారా భువనేశ్వరి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కుప్పం పిఈఎస్ కళాశాల వద్ద నారా భువనేశ్వరిని కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఆమె నేటి నుంచి నాలుగు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.