నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఆన్ లైన్ లో వచ్చే మోసపూరిత వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని చెప్పారు. నమ్మకమైన వెబ్ సైట్ల ద్వారానే వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు. వినియోగదారులు నష్టానికి, మోసానికి గురికాకుండా చూడడమే వినియోగదారుల చట్టం ముఖ్య లక్ష్యమని తెలిపారు.