నగిరి నియోజకవర్గం నిండ్ర మండలం పాదిరి దళితవాడలో మంగళవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. అనంతరం పేద ప్రజలకు దుప్పట్లు, బిందెలను పంపిణీ చేశారు.