ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గిరిధర్ రెడ్డి

76చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గిరిధర్ రెడ్డి
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ 26వ డివిజన్ జ్యోతి నగర్ లో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ ఊరందూరు సురేంద్రబాబు, కార్పొరేటర్ బూడిద సుప్రజ, టిడిపి నాయకులు బూడిద పురుషోత్తం యాదవ్, శివాచారి, ఎల్. పి. కృష్ణారెడ్డి, జహీర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్