గ్రామాలలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని గ్రామీణ యువత మహిళలకు ఉపాధి దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్ లో ఛత్తీసఘడ్ బృందంతో వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా గ్రామీణ వనరులను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగం ద్వారా చేపడుతున్న పనులను అధికారులు వారికి వివరించారు.