పలమనేరు పట్టణంలో ఓ తాగుబోతు మంగళవారం వీరంగం సృష్టించాడు. రంగబాబు సర్కిల్ నుంచి ఎద్దులసంతకు వెళ్లే రోడ్డుపై అడ్డంగా పడుకుని హల్చల్ చేశాడు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా ఏమాత్రం లెక్కచేయకుండా వాహనాలకు అడ్డంగా పడుకున్నాడు. వాహనదారులు ప్రశ్నిస్తే వారిని నానా దుర్భాషలడాడు. దీంతో చేసేదేమీ లేక వాహనదారులు మిన్నకుండిపోయారు. చివరకు కొంతమంది అతన్ని పక్కకు లాగి పడుకోబెట్టడంతో వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.