కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ కానుకలను ఈ నెల 17న లెక్కించనున్నట్లు ఈఓ వాణి తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో నిర్వహించే హుండీ కానుకల లెక్కింపునకు ఆలయ అధికారులు, సిబ్బంది హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొంటారని తెలిపారు.