తవణంపల్లె మండలం జి. వడ్డిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినరక్ వాటర్ ప్లాంట్ ను పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం ప్రారంభించారు. జి. వడ్డిపల్లి గ్రామంకు చేరుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్ కు మండల, స్ధానిక నాయకులు, కార్యకర్తలు గజమాలతో సత్కరించి ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం పైమాఘం సుగుణాకర్ రెడ్డి ఆర్ధిక సహాయంతో నిర్మించిన నీటి శుద్ది కేంద్రంను దాత పైమాఘం సుగుణాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.