కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భీమారావు, చిత్తూరు కోర్టు సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.