చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో అన్న క్యాంటీన్ శుక్రవారం పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్ర రెడ్డి ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని చల్లా బాబు తెలియజేశారు. స్థానిక ప్రజలు, రైతులు ఈ విషయం తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా పలువురికి చల్లా రామచంద్ర రెడ్డి స్వయంగా అల్పాహారాన్ని అందజేశారు.