పుంగనూరు మండలం లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో శనివారం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడిని మదనపల్లె మండలం గుంపులపల్లె సోమశేఖర్ రెడ్డి(36)గా పోలీసులు గుర్తించారు. తాగుడుకు బానిసై కుటబీకులను వేధిస్తుండటంతో అతడి తండ్రే హత్య చేయించినట్లుగా గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల మధ్య డబ్బు కోసం గొడవ జరగ్గా ఈ విషయం బయటికి పొక్కినట్లు తెలుస్తోంది. సీఐ శ్రీనివాస్ కేసు నమోదు చేశారు.