పుంగనూరు టౌన్ కోనేటి వద్ద గల శ్రీ అన్నపూర్ణ దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం గజ స్థంభ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని శైవాగమోక్తంగా రిత్వికులు నిర్వహిస్తున్నారు. మంగళవారం వాస్తు పూజ, వాస్తు హోమం, బలిపర్యగ్నికరణం ప్రధాన హోమాలు నిర్వహించారు. 25న సాయంత్రం ఆకాశ దీపారాధన, పుష్కరిణిలో లక్ష దీపోత్సవం ఉంటుందని అర్చకులు తెలిపారు.