పుంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను టీటీడీ సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్ పరిశీలించారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఏర్పాట్ల పై ఆలయ ఇన్స్పెక్టర్ మునీంద్ర బాబును అడిగి తెలుసుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు.