చిత్తూరు జిల్లా పుంగనూరు ఆర్టీసీ డిపో నుంచి పౌర్ణమి సందర్భంగా సోమవారం అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజులలో అరుణాచలంకు వెళ్లే సర్వీసుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు.