స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలంటూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధికారులకు విన్నవించుకుంటున్నారు. ముత్తుకూరులోని కప్పల దొరువు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ సమస్య నెలకొని ఉంది. ఈ పాఠశాలలో సుమారు 43 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ విద్యార్థులకు త్రాగునీరు సక్రమంగా లేదు. స్వచ్ఛమైన శుద్ధి జలాలు అందించాలని విద్యార్థులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.