
వెంకటాచలం: బాలికను గర్భవతి చేసి మోసం
ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి. ఓ బాలికను గర్భిణీని చేసి, ఆపై దాన్ని తొలగించేలా చేసిన యువకుడిపై సోమవారం పోక్సో కేసు నమోదైంది. కనుపూరుకు చెందిన మొండెం కృష్ణ వంశీ మాయమాటలు చెబుతూ అదే గ్రామానికి చెందిన బాలిక (16)పై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాలిక గర్భవతి అయ్యింది. బలవంతంగా గర్భనిరోధక మాత్రలు మింగించాడు. ఇటీవల దారుణంగా కొట్టి మరోసారి లైంగిక దాడికి పాల్పడడంతో బాలిక ఫిర్యాదు చేసింది.