సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గుల్షన్ బేగంకు పదోన్నతి లభించింది. పరిపాలన అధికారిగా శ్రీకాళహస్తికి బదిలీ అయ్యారు. పదోన్నతి పై వెళుతున్న గుల్షన్ బేగంకు ఎంపీడీవో త్రివిక్రమ రావు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు విద్యానాథరెడ్డి బుధవారం ఘనంగా సత్కరించారు. ఆమె సేవలు గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.