నాగలాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన మత్స్యావతార మూర్తి శ్రీ వేదనారాయణ స్వామి ఆలయానికి గుజరాత్ రాష్ట్రం జాంనగర్ నుంచి హరే రామ హరే కృష్ణ భక్త బృందం గురువారం రాత్రి దర్శనానికి వచ్చారు. ఆలయంలో హరే రామ హరే కృష్ణ భజనలు చేశారు. ఆలయ అధికారులు భజన బృందానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు నాగరాజు భట్టాచార్య స్వామి వారి ప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతలను వారికి వివరించారు.