నాగలాపురం: మందు బాబులకు అడ్డాగా రైతు భరోసా కేంద్రం

80చూసినవారు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో 18 లక్షలతో గత ప్రభుత్వం ఆర్. బి. కె భవనాన్ని నిర్మించారు. ఈ నూతన భవనం ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. మందుబాబులకు నిలయంగా మారిందని భవనం వద్ద ఉన్న మద్యం బాటిళ్లను చూస్తేనే అర్థమవుతుంది. మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయని స్థానికులు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్