నాగలాపురంలో ఆగస్టు 7, 8 తేదీలలో జరుగు పోలేరమ్మ జాతరకు సంబంధించి బుధవారం రాత్రి పసుపు కుంకుమ కంకణాలు గ్రామ పెద్దలు, గ్రామస్తులు డప్పులమోతలు మధ్య ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. పూజారులు శాస్త్రోక్తంగా అమ్మవారికి కంకణ ధారణ చేసి, పూజారులు సైతం కంకణ ధారణ చేసుకున్నారు. ఆలయంలో పూజల అనంతరం భక్తులకు దర్శన ఏర్పాటు చేశారు. పూజారులు భక్తులకు కర్పూర హారతులు అందించారు.