శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని అముడూరు గ్రామంలో బుధవారం ఆడేపల్లి ఎల్లయ్య (55) అనే వ్యక్తి పాము కాటుకు గురై మృతి చెందాడు. అముడూరు దళితవాడకు చెందిన ఎల్లయ్య గ్రామానికి చెందిన ఒకరికి వేరుశనగ పీకే కూలి పనికి వెళ్లారు. పొలంలో పాముకాటుకు గురయ్యారు. అనంతరం స్థానికంగా నాటు వైద్యం చేయించి ఏంపేడు పిహెచ్సి కి వెళ్లి అక్కడి నుంచి వెంకటగిరి ఆసుపత్రికి వెళ్లట్టు సమాచారం.